సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కు 14 రోజుల రిమాండ్

  • బండ్ల గణేశ్ పై చెక్ బౌన్స్ కేసు
  • రిమాండ్ విధించిన కడప జిల్లా మేజిస్ట్రేట్ 
  • నవంబర్ 4 వరకు రిమాండ్ లో ఉండనున్న గణేశ్
టాలీవుడ్ నిర్మాత, సినీ నటుడు బండ్ల గణేశ్ కు కడప కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నవంబర్ 4 వరకు ఆయన రిమాండ్ లో ఉండనున్నారు. కడపకు చెందిన మహేశ్ అనే వ్యక్తి నుంచి బండ్ల గణేష్ 2011లో రూ. 13 కోట్ల అప్పు తీసుకున్నారు. డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో 2013లో గణేశ్ పై మహేశ్ చెక్ బౌన్స్ కేసు పెట్టాడు. ఈ నేపథ్యంలో అతనిపై కడప పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, కోర్టు విచారణకు గణేశ్ హాజరుకాకపోవడంతో కడప జిల్లా మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో, బండ్ల గణేశ్ ను హైదరాబాదులో అదుపులోకి తీసుకున్న పోలీసులు కడప కోర్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.
Go Back to Shorts
Bandla Ganesh
Remand
Tollywood

More Telugu News